News October 9, 2025
నల్గొండ: పండుగ వేళ.. రూ.1.65 కోట్ల ఆదాయం

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీకి భారీ అదనపు ఆదాయం సమకూరింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వారం రోజులపాటు నల్గొండ, నకిరేకల్, యాదగిరిగుట్ట, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల ద్వారా 597 అదనపు బస్సులను ఆర్టీసీ నడిపింది. ఈ 7 డిపోల పరిధిలో పండుగకు ముందు, తరువాత మొత్తం 33,99,804 కిలోమీటర్ల మేర బస్సులను నడపగా, ఆర్టీసీకి ఏకంగా రూ.1,65,78,605 వరకు అదనపు ఆదాయం లభించింది.
Similar News
News October 9, 2025
ముగ్గురితో మొదలై 11వేలమందితో పయనం

మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్ ట్వీట్లతో వార్తల్లోకెక్కిన ZOHO, దాని ఫౌండర్ శ్రీధర్‌పై చర్చ జరుగుతోంది. TN లో పేదింట పుట్టిన ఆయన మద్రాస్ IIT, ప్రిన్స్‌టన్ (US)లలో చదివారు. ‘క్వాల్కమ్’ లో పనిచేశారు. 1996లో ఇండియా వచ్చి ‘అడ్వెంట్ నెట్’ స్థాపించారు. అదే జోహోగా మారింది. ముగ్గురితో స్టార్టై ఇపుడు 11000 మందితో ₹1.03లక్షల కోట్లకు ఎదిగింది. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2021లో పద్మశ్రీ అందించింది.
News October 9, 2025
సిద్దిపేట: ‘బాండ్ పేపర్ పై సంతకం చేసి పోటీ చేయాలి’

సిద్దిపేట జిల్లా నంగునూర్ మంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు బాండ్ పేపర్ పై సంతకం చేయాలని యువత నిర్ణయం తీసుకుంది. రూ.100 బాండ్ పేపర్ పై ‘అక్రమ ఆస్తులు సంపాదించనని, ఐదేళ్ల తర్వాత ఆస్తులు పెరిగితే గ్రామానికి అప్పగిస్తామని, జీపీ పనుల కోసం ప్రజల దగ్గర డబ్బులు అడగనని, తప్పుడు లెక్కలు చూపనని, గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తాను’ అని రాసి బాండ్‌లో పేర్కొన్నారు.
News October 9, 2025
హర్షిత్ సెలక్షన్ వెనక లాజిక్ ఏంటో: అశ్విన్

టీమ్ ఇండియాలోకి హర్షిత్ రాణాను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ స్పందించారు. ‘హర్షిత్ సెలక్షన్ వెనకున్న లాజిక్ ఏంటో తెలియదు. అతడిని ఎందుకు తీసుకున్నారో నాకూ తెలుసుకోవాలనుంది. AUSలో బ్యాటింగ్ కూడా చేయగలిగిన బౌలర్ అవసరం. హర్షిత్ బ్యాటింగ్ చేస్తాడని వాళ్లు భావించి ఉండొచ్చు. అతడు అర్హుడా అని నన్నడిగితే.. సందేహించాల్సిన విషయమే’ అని చెప్పారు.