News April 6, 2025

నల్గొండ: పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు

image

నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ నివాసంలో పూజలు చేసి అక్కడ నుంచి మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల నడుమ నూతన పట్టు వస్త్రాలను సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తీసుకువెళ్లి స్వామి వారికి సమర్పించారు.

Similar News

News April 7, 2025

NLG: కొత్త కార్డుల కోసం ఎదురుచూపులు

image

రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం సగానికి పైగా లబ్ధిదారులు తినకపోవడం.. తీసుకున్న బియ్యం టిఫిన్ల కోసం వినియోగించేవారు. తినడానికి పనికి రాని బియ్యంకోసం ఏం ఆశపడుతామని మౌనంగా ఉన్న కార్డులేని వారు.. సన్న బియ్యం ఇవ్వడంతో తమకు కార్డు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

News April 7, 2025

నేరేడుగొమ్ము: పురుగు మందు తాగి ఒకరి సూసైడ్

image

ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుడిపల్లి ఎస్ఐ మేరకు.. నేరేడుగొమ్ము మండలం చిన్నమునిగల్‌కి చెందిన అరవింద్(27) అప్పులు బాధతో పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో పురుగు మందు తాగాడు. అనంతరం భార్యకు వీడియో కాల్ చేయడంతో విషయం తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యలు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News April 6, 2025

నల్లగొండ: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్టు

image

అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను మీడియాకు వివరించారు. ఐదుగురు నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన 600 లీటర్ల స్పిరిట్‌తో పాటు అక్రమంగా తయారు చేసిన 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.

error: Content is protected !!