News March 30, 2025
నల్గొండ: పదో తరగతి పరీక్షకు 41 మంది డుమ్మా

పదో తరగతి పరీక్షలు నల్గొండ జిల్లాలో 7వ రోజు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 105 పరీక్ష కేంద్రాలలో సైన్స్ పేపర్- 2 (జీవశాస్త్రం) పరీక్ష నిర్వహించగా 18,666 మంది విద్యార్థులకు గానూ 18,625 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బీ.బిక్షపతి తెలిపారు.
Similar News
News July 5, 2025
NLG: వన మహోత్సవానికి సిద్ధం

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 68.70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
News July 5, 2025
NLG: 8 నుంచి పోస్టల్‌లో కొత్త సాఫ్ట్వేర్

పోస్టల్ డివిజన్లోని NLG, యదాద్రి BNG జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద NLG డివిజన్లోని 2 హెడ్ ఆఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్‌లు, 392 పోస్టాఫీస్‌లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
News July 4, 2025
నల్గొండ: మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన

IPR సెల్ MGU నల్గొండ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, TG స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడారు. విద్యార్థులు వినూత్న ఆలోచన, ఆచరణాత్మక దృక్పథానికి, క్రమశిక్షణ తోడైతే ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలుగా ఎదిగి పేటెంట్ సాధించడం సులువు అని అన్నారు.