News December 2, 2025

నల్గొండ: పల్లెల్లో పార్టీల ఫైట్..!

image

సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేకున్నా.. పార్టీలకు పల్లెపోరు ప్రతిష్ఠాత్మకంగానే మారింది. తాము బలపర్చే అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, BRS సీరియస్‌గా పనిచేస్తున్నాయి. డీసీసీ పదవి చేపట్టిన పున్న కైలాస్ నేత క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీని పంచాయతీలోనూ గెలిపించుకుందామంటూ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు BRS, BJP తమ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం యత్నిస్తున్నాయి.

Similar News

News April 14, 2026

హన్మకొండ: మే 11 నుంచి ఇండ్ల గణన

image

రాష్ట్రంలో మే 11 నుంచి ప్రారంభం కానున్న ఇండ్ల గణనను పారదర్శకంగా నిర్వహించాలని జనగణన రాష్ట్ర సంచాలకులు భారతి హోళికేరి ఆదేశించారు. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుకు ఈ డేటా కీలకమని పేర్కొన్నారు. హన్మకొండ జిల్లాలో ఇప్పటికే 87 శాతం ఎన్యుమరేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వెల్లడించారు.

News April 14, 2026

భూగర్భజలాల పెంపునకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

image

జిల్లాలో జలధార పథకం కింద భూగర్భ జలాల మట్టం పెంపుదలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జలధార కార్యాచరణ ప్రణాళికపై సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని చెరువుల పూడికలను ఉపాధి హామీ పథకం కింద తీసేందుకు మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలన్నారు.

News April 14, 2026

యోగాతో ఆరోగ్యం: కలెక్టర్

image

ఆనంద‌మ‌య జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగా అద్భుత అవ‌కాశ‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలోని అమ‌రావ‌తి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేష‌న్ హాల్‌లో నిర్వహించిన యోగా కార్య‌క్ర‌మంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అమ‌రావ‌తి యోగా యూట్యూబ్ ఛానల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌ను ప్రారంభించారు. ఎంతో మంది యోగాచ‌ర‌ణ‌ను త‌మ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నార‌న్నారు.