News January 31, 2026

నల్గొండ: పెట్రోల్ దాడిలో గాయపడ్డ బాలుడి మృతి

image

నాంపల్లి మండలం కేతేపల్లిలో జరిగిన <<19012188>>పెట్రోల్ దాడి<<>>లో ఐదు నెలల బాలుడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో నరేశ్ భార్య మమతపై సుజాత నిప్పంటించగా ఆమె మృతిచెందింది. ఇప్పుడు పసికందు కూడా మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ అమానుషానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News February 5, 2026

NTR జిల్లాలో 21 బార్ల కేటాయింపు

image

ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ 2025-28 ప్రకారం జిల్లాలో లాటరీ విధానంలో బార్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా జరిగిందని NTR జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ప్రత్యక్ష పరిశీలనలో జరిగిన ఈ ప్రక్రియలో గతంలో మిగిలిన బార్లకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. తాజాగా 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించినట్లు వెల్లడించారు.

News February 5, 2026

చరిత్రలో తొలిసారి.. తగ్గుతున్న జెన్‌జీల IQ

image

జెన్‌జీలు తెలివితేటల్లో వెనకపడిపోతున్నట్లు న్యూరో సైంటిస్ట్ డాక్టర్ హార్వత్ పరిశోధనలో వెల్లడైంది. దీని ప్రకారం చరిత్రలో మునుపటి తరం కంటే తక్కువ IQ నమోదైన తొలి తరం ఇదేనని తెలిపారు. దీనికి ప్రధాన కారణం విద్యా రంగంలో మితిమీరిన టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్‌ల వాడకమని హెచ్చరించారు. పుస్తక పఠనం తగ్గడం, ఏఐ సమాధానాలపై ఆధారపడటం వల్ల వారి ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి దెబ్బతింటున్నాయని ఆయన వివరించారు.

News February 5, 2026

ప.గో: అభ్యర్థులకు గమనిక.. పరీక్ష తేదీ మార్పు

image

ఉమ్మడి ప.గో జిల్లా న్యాయసేవాధికార సంస్థలో నూతనంగా మంజూరైన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు ఈనెల 7న జరగాల్సిన రాత పరీక్ష అనివార్య కారణాలతో మార్చబడిందని జిల్లా జడ్జి శ్రీదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఏలూరు సీఆర్‌రెడ్డి ఇంటర్మీడియట్ బ్లాక్ నందు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు గమనించాలన్నారు.