News December 16, 2025
నల్గొండ: పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు

ఇటీవల జరిగిన మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పొత్తులతో కమ్యూనిస్టు పార్టీలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. సీపీఎం 48, సీపీఐ 63, సీపీఐ(ఎంఎల్) మాస్ 10 స్థానాలు గెలుచుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల్లో వీరి ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పొత్తులు కలిసి వచ్చాయి.
Similar News
News December 17, 2025
SRCL: లక్ష్మీనరసింహస్వామికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర అందజేత

సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతం సృష్టించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకించి అగ్గిపెట్టెలో ఇమిడే రెండు గ్రాముల బంగారు చీరను మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో వెంకటస్వామికి అందించారు. దీని పొడవు 5:30 మీటర్లు వెడల్పు 48 ఇంచులు దీనిని తయారు చేయుటకు వారం రోజుల వ్యవధి పట్టిందన్నారు. ఈ సందర్భంగా నల్ల విజయ్‌కు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.
News December 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 17, 2025
GDK: ధనుర్మాసంలో పంచరామాలకు ప్రత్యేక బస్సు

GDK నుంచి పంచరామాలకు 4 రోజుల యాత్ర ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో పంచారామాలతో పాటు అన్నవరం, సింహాచలం, RK బీచ్, విజయవాడ, అమరావతి దర్శనాలు ఉంటాయి. ఈ యాత్ర DEC 25న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఒక్కరికి ఛార్జీ రూ.4200గా ఉంటుందని DM నాగభూషణం తెలిపారు. భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాలని, టికెట్ బుకింగ్స్, మరిన్ని వివరాలకు 7382847596, 7013504982 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


