News August 13, 2025
నల్గొండ: పోక్సో నిందితుడికి జీవిత ఖైదు

నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో నిందితుడు గ్యారాల శివకుమార్‌కి జీవిత ఖైదీ విధిస్తూ బుధవారం మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. 2023లో మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం చేశాడనే ఆరోపణపై శివకుమార్‌పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.
Similar News
News August 14, 2025
NLG: 18 నుంచి రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ

జిల్లాలో రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణను ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ (రెవెన్యూ), జిల్లా సర్వే అధికారి జి.సుజాత తెలిపారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక జిరాక్స్ సెట్, ప్రభుత్వ సివిల్ సర్జన్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఉదయాదిత్య భవన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకోవాలన్నారు.
News August 14, 2025
దామరచర్లలో అత్యధికం.. నార్కట్ పల్లిలో అత్యల్పం

జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు జిల్లాలో 30 మి.మీ. సగటు వర్షం కురిసింది. దామరచర్లలో అత్యధికంగా 77.2 మి.మీ., అత్యల్పంగా నార్కెట్ పల్లిలో 2.5 మి.మీ. వర్షం కురిసింది. కనగల్ మండలంలో 42.7మి.మీ., మునుగోడు 15.5 మి.మీ., చండూరు 21.5 మి.మీ., మర్రిగూడ 48.2 మి.మీ., చింతపల్లి 13.1 మి.మీ., నాంపల్లి 32.6 మి.మీ., గుర్రంపోడు 42.5 మి.మీ., అనుములు హాలియా 23.7 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.
News August 14, 2025
గుర్రంపోడు: ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

గుర్రంపోడులోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జి.రాగిణి తెలిపారు. ఈ నెల 18వ తేదీలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మిషన్ కావాల్సిన వారు నేరుగా పాఠశాలకు వచ్చి ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. 9397320844 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.