News February 8, 2025

నల్గొండ పోలీసులకు తలనొప్పిగా పిల్లి కేసు!

image

పిల్లి పెట్టిన లొల్లి NLG పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానిక రహమత్ నగర్‌కు చెందిన పుష్పలత పెంచుకుంటున్న పిల్లి ఏడాదిక్రితం తప్పిపోగా PSలో ఫిర్యాదు చేశారు. పక్కింట్లో అదే పోలికలతో ఉన్న పిల్లి కనిపించగా ఆపిల్లి తమదేనని, పక్కింటి వారు ఎత్తుకెళ్లారంటూ Jan15న 2టౌన్‌ PSలో పుష్పలత కేసు పెట్టింది. పోలీసులు పిల్లి వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచారు. పిల్లి ఎవరికి చెందుతుందో తేలాల్సి ఉంది.

Similar News

News September 14, 2025

మునుగోడు: యువతి సూసైడ్

image

తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులకు వెళ్లాలని తల్లి మందలించగా మునుగోడు మండలం చెల్మెడకు చెందిన భవాని (25) పురుగుల మందు తాగింది. చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News September 14, 2025

నల్గొండ: 26,692 కేసుల పరిష్కారం

image

జాతీయ లోక్ అదాలత్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. శనివారం ఒక్క రోజే 26,692 కేసులను పరిష్కరించినట్లు జిల్లా జడ్జి ఎం.నాగరాజు వెల్లడించారు. ఈ అదాలత్‌లో 71 సివిల్, 15,921 క్రిమినల్, 96 మోటార్ వాహన ప్రమాద బీమా, 50 బ్యాంక్, 73 సైబర్ క్రైమ్, 35 ట్రాన్స్‌కో, 10,446 ట్రాఫిక్ చలాన్ కేసులు రాజీ కుదిరి పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News September 14, 2025

NLG: తెప్ప తిరగబడి మత్స్యకారుడి మృతి

image

చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మత్య్సకారుడు మృతిచెందాడు. ఈ ఘటన శనివారం జరగ్గా ఆదివారం మృతదేహం లభ్యమైంది. మాడుగులపల్లి (M) గజలాపురం గ్రామానికి చెందిన సింగం యాదగిరి (37) ఈనెల 13న చేపలు పట్టేందుకు అతని కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి పానగల్ ఉదయ సముద్రం కట్ట వద్దకు వెళ్లాడు. ఒక్కసారిగా వర్షం కురిసి, బలమైన గాలికి తెప్ప ప్రమాదవశాత్తు తిరగబడి యాదగిరి చెరువులో మునిగి మృతి చెందాడు.