News February 6, 2026

నల్గొండ: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. ఇందుకోసం అన్ని మున్సిపాలిటీల్లో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 7, 2026

నల్గొండ: ‘వాటర్ బెల్’ మోగట్లేదు..!

image

NLG జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అటకెక్కింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు జిల్లాలోని 1,483 పాఠశాలల్లో రోజుకు మూడుసార్లు నీరు తాగించేలా ఈ నిబంధన తెచ్చారు. అయితే, విద్యాశాఖ పర్యవేక్షణ లోపంతో మెజారిటీ పాఠశాలల్లో గంట మోగడం లేదు. అధికారులు స్పందించి ఈ విధానం అమలయ్యేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

News February 7, 2026

NLG: నేడు జవహర్ నవోదయ పరీక్ష

image

పెద్దవూర(M) చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి 9వ, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. NLG పబ్లిక్ స్కూల్, DVK రోడ్డులోని గవర్నమెంట్ బాలుర హైస్కూల్, పెద్దవూర చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News February 7, 2026

NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

image

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్‌తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్‌ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.