News December 21, 2024

నల్గొండ ప్రజలకు విషమిచ్చి చంపండి: కోమటిరెడ్డి

image

CM రేవంత్‌ మూసీని అభివృద్ధి చేసి NLG జిల్లా ప్రజల బాగు కోరుతుంటే బావబామ్మర్దులు(కేటీఆర్, హరీశ్‌రావు) అడ్డుపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో ఫైరయ్యారు. తాము బతకాలని లేకుంటే విషమిచ్చి చంపండని అసహనం వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి నల్గొండ జిల్లాకు ఒక్క ఎకరాకు కూడా ఎక్కువగా ఇరిగేషన్ వాటర్ ఇవ్వలేదన్నారు. ఏ ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించిన దాఖలాలు లేవన్నారు.

Similar News

News November 1, 2025

మూగజీవాలకు కష్టాలు.. నట్టల మందుల సరఫరా నిలిపివేత

image

నల్గొండ జిల్లాలో గత రెండేళ్లుగా పశుసంవర్ధక శాఖ మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాపరులు ప్రైవేటుపై ఆధారపడుతున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల గొర్రెలు, 2 లక్షల మేకలు ఉన్నట్లు అంచనా. స్టాక్ త్వరలో వస్తుందని, అందిన వెంటనే పంపిణీ చేస్తామని ఏడీ రమేష్ బాబు తెలిపారు.

News November 1, 2025

చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారు!

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈనెల రెండో తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది.

News November 1, 2025

జిఎన్ఎం కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరీ (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా వైద్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డిఎంహెచ్వో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.