News January 13, 2026
నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ ఫోకస్

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కలెక్టర్ చంద్రశేఖర్ చర్యలు ముమ్మరం చేశారు. గతవారం జిల్లాలో 4,600 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండగా, అధికారుల కృషితో ఈ వారం నాటికి ఆ సంఖ్య 1,699కి తగ్గింది. వచ్చే వారం నాటికి పెండింగ్ ఫిర్యాదుల సంఖ్యను 500 లోపుకు తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 23, 2026
NLG: రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: ఎస్పీ

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నల్గొండ ఆర్టీసీ డిపోలో ఆర్ఎం కె.జాన్ రెడ్డి ఆధ్వర్యంలో రీజియన్ స్థాయిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ.. ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
News January 23, 2026
NLG:అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా అధికారులతో గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్.. నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
News January 23, 2026
రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకుందాం: కలెక్టర్

జిల్లావ్యాప్తంగా రంజాన్ మాసాన్ని మతసామరస్యంతో, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల వద్ద విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల్లో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


