News March 10, 2026
నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 14, 2026
హాలియా: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

అనుముల మండల కేంద్రమైన హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
News April 14, 2026
నార్కట్‌పల్లి: కారులో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి

నార్కట్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఇంటి ముందున్న కారులోకి వెళ్లిన పేర్ని చరణ్య (5) ఊపిరాడక స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ విష్ణుమూర్తి ఆస్పత్రికి చేరుకుని తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.