News August 21, 2025
నల్గొండ: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీ

సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్నపిల్లలకు సత్వర చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులను ఈరోజు ఆదేశించారు. అంతేకాక ఆయా వ్యాధులకు సంబంధించి వ్యాధి నివారణ మందులు ముందే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గురువారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి చిన్న పిల్లల వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న మందులు, ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News August 21, 2025
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ని పెంచాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ అధికారులు, తహశీల్దార్లతో ఆమె సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మండలాల ప్రత్యేక అధికారులు, గృహ నిర్మాణ ఇంజినీర్లు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రౌండింగ్ చేయాలన్నారు.
News August 21, 2025
గుర్రంపోడు: కరెంట్ షాక్‌తో ఎనిమిది గొర్రెలు మృతి

కరెంట్ షాక్‌తో ఎనిమిది గొర్రెలు మృతిచెందిన ఘటన గుర్రంపోడు మండలం పిట్టలగూడెం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన బండారు వెంకటయ్య గొర్రెలను మేపేందుకు ఏఎమ్ఆర్పీ కాల్వ వద్దకు వెళ్లాడు. కాల్వలో అమర్చిన మోటారుకు విద్యుత్ సరఫరా అవుతుండడంతో అక్కడికి వెళ్లిన గొర్రెలకు విద్యుత్ షాక్ తగిలింది. ఎనిమిది గొర్రెలు మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
News August 21, 2025
NLG: గాలిలో దీపంలా మూగజీవాల సంరక్షణ!

జిల్లాలోని ప్రభుత్వ పశు వైద్యశాలల్లో వైద్యం అందని ద్రాక్షగా మారింది. అత్యవసర సమయాల్లో పశువులకు వినియోగించే మెడిసిన్తో సహా విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి పలురకాల మందుల సరఫరా కొన్ని నెలలుగా నిలిచిపోయింది. ఫలితంగా జీవాల పెంపకందారులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ మందుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూగజీవాల సంరక్షణ గాల్లో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.