News July 5, 2024

నల్గొండ: ప్రాణాలు తీస్తున్న కరెంటు తీగలు

image

కరెంటు తీగలు మనుషులు, పశువుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు ఏడాదిలోనే 43 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 65 మూగజీవాలు చనిపోయాయి. జిల్లా అధికారుల లెక్క ప్రకారం గాయపడిన వారి సంఖ్య తక్కువగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉద్యోగుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

Similar News

News July 8, 2024

మిర్యాలగూడలో రైలు కింద పడి ఆటో డ్రైవర్ సూసైడ్ 

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ పోషణ భారమై ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై పవన్ కుమార్ రెడ్డి, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెం దుర్గా నగర్ కాలనీకి చెందిన నాగేంద్రబాబు(32) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆటోలు కొని ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక కుటుంబ పోషణ భారంగా మారి ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 8, 2024

నల్గొండ: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్ 

image

పురుగుల మందు తాగి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చివ్వెంల మం కుడకుడలో జరిగింది. ఎస్సై కనకరత్నం వివరాలిలా.. మహేశ్ (28)కు ఏడాది క్రితం గాయంవారిగూడేనికి చెందిన నాగలక్ష్మితో వివాహమైంది. గొడవలు రావడంతో 6 నెలల క్రితం విడిపోయారు. మద్యానికి బానిసైన మహేశ్‌ను తల్లి మందలించడంతో శనివారం రాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు SRPT ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదైంది. 

News July 8, 2024

నల్గొండ: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు

image

నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో విద్యుద్ఘాతంతో ప్రజలు, పశువుల ప్రాణాలు పోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులు, పొలం పనికి వెళ్లిన రైతులు కరెంట్ కాటుకు బలైన ఘటనలో ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కరెంట్ తీగలు కిందికి ఉండడం, కొన్నిచోట్ల కరెంటు తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి జులై వరకు విద్యుద్ఘాతంతో 81 పశువులు మరణించగా, 31 మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు.