News March 26, 2024
నల్గొండ: ఫస్ట్ నుంచి కొనుగోళ్లు షురూ

ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగాలు సన్నద్ధమవుతున్నాయి. రైతులు ధాన్యం తీసుకువస్తే రెండు, మూడు రోజులు ముందుగానే కేంద్రాలు తెరవడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోళ్లపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేసింది.
Similar News
News September 9, 2025
NLG: పోషణ ట్రాకర్, NHTS యాప్‌లతో అష్టకష్టాలు!

జిల్లాలో అంగన్వాడీ టీచర్లు పోషణ ట్రాకర్, NHTS యాప్‌లతో అష్టకష్టాలు పడుతున్నారు. పోషణ ట్రాకర్ యాప్లో లబ్దిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బంది తప్పడం లేదు. ఫేస్‌ను యాప్లో గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపోర్ట్ చేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. సర్వర్ సమస్యతో యాప్ లు మొరాయిస్తుండటంతో కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది నెలలో ఐదారుసార్లు కేంద్రాలకు రావాల్సి వస్తుంది.
News September 9, 2025
NLG: జీపీఓలు వచ్చేశారు!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పాలన అధికారులు ఎట్టకేలకు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,016 మంది జీపీఓలను నియమించగా నల్గొండ జిల్లాకు 276 మందిని కేటాయించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశంలో అధికారులు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రెవెన్యూ గ్రామాలతో ఏర్పాటుచేసిన క్లస్టర్ల వారీగా జీపీఓలకు పోస్టింగ్ ఇచ్చారు.
News September 9, 2025
NLG: సులువుగా ఎర.. చిక్కితే విలవిల

నల్గొండ జిల్లాలో రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు పేట్రేగి పోతున్నారు. నిరక్షరాస్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం వీరి ఉచ్చులో పడి మోసపోతున్నారు. ఇటీవల మిర్యాలగూడకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి వీడియో కాల్ చేసి మీపై పోక్సో కేసు ఉందని బెదిరించి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులను ఆశ్రయించగా అది సైబర్ నేరగాళ్ల పనేనని వారు నిర్ధారించారు.