News March 19, 2025
నల్గొండ: బడ్జెట్‌లో వరాలు కురిపిస్తారా..!

రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని 11 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే డిండి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపుపై ఆయకట్టు రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధి, ఏఎంఆర్పీ పరిధిలోని కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయించాల్సి ఉంది. పాత ఎత్తిపోతల పథకాలకు ఫండ్స్ ఇవ్వాలన రైతులు కోరుతున్నారు.
Similar News
News November 5, 2025
NLG: కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం ఘటనలు

జిల్లాలో మహిళల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతుంది. తిప్పర్తి పీఎస్ పరిధిలో కాజీరామారం గ్రామానికి చెందిన కందుకూరి సౌజన్య(24), చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన వివాహిత మంకాల రేణుక(35)లు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కూడా వివాహితులే కావడం విశేషం.
News November 5, 2025
NLG: రేపటి నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

మహాత్మాజ్యోతిబా ఫులే గురుకుల సొసైటీ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకులంలో ఈనెల 6వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 14 ఏళ్ల నుంచి 19 ఏళ్ల బాలురకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, తదితర అన్ని రకాల ఆటలు ఉంటాయి. గేమ్స్‌కు సంబంధించి స్పోర్ట్స్ మీట్, సెలక్షన్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ తెలిపారు.
News November 5, 2025
NLG: 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ: కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలంలో ఇప్పటి వరకు 72,475 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామని, అందులో 46,568 మెట్రిక్ టన్నుల ధాన్యం ఓపీఎంఎస్‌లో ఎంట్రీ చేసి.. 5,657 మంది రైతులకు రూ.102 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.


