News October 7, 2025

నల్గొండ: బాలికపై హత్యాచారం.. కఠిన చర్యలకు ఆదేశం

image

డైట్ స్కూల్ సమీపంలో మైనర్ బాలికపై హత్యాచారం జరగ్గా ఆ ప్రదేశాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. కేసు విచారణలో పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 7, 2025

NLG: అధిక వడ్డీ దందా.. తెర వెనుక మరో వ్యక్తి..!

image

పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్ <<17937867>>అధిక వడ్డీ<<>> ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేసి పరారీలో ఉండగా అతని ఇంటిపై బాధితులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దందా వెనుక మధు అనే మరో యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాలాజీ నాయక్‌తో కలిసి మధు అనే యువకుడు గ్రామీణ ప్రజలే లక్ష్యంగా ఈ దందా నడిపినట్లు సమాచారం. బాలాజీ కంటే మధునే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

News October 7, 2025

స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్స్

image

* ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌కు నామినేట్ అయిన అభిషేక్ శర్మ, కుల్దీప్, బ్రయాన్(ZIM)
* DGCA డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినట్లు ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
* సియట్ అవార్డ్స్‌లో సంజూ శాంసన్ టీ20 బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, శ్రేయస్ అయ్యర్ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు.
* ఆస్ట్రేలియాపై ఆడడం తనకు ఇష్టమని, అక్కడి ప్రజలు క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తారన్న రోహిత్ శర్మ

News October 7, 2025

SKLM: పిడుగుపాటుతో ముగ్గురు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి

image

మెలియాపుట్టి మండలం గంగరాజపురం క్వారీ వద్ద పిడుగుపాటుతో ముగ్గురు కూలీలు మృతి చెందడం పట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పిడుగుపాటుతో మృతి చెందడం చాలా దురదృష్టకరమన్నారు. అస్వస్థతకు గురై టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.