News December 9, 2025
నల్గొండ: బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్ష తేదీలు విడుదల

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో జరగబోయే బీటెక్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్(R-23) పరీక్షల టైం టేబుల్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల జనవరి 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన తెలిపారు.
Similar News
News December 15, 2025
నల్గొండ: సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వినతిపత్రం

నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో డిసెంబర్ 30 నుంచి నిర్వహించే పీజీ 3 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు నెట్ పరీక్ష ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వాయిదా వేయాలని కోరారు. యూనివర్సిటీ కార్యదర్శి మోహన్, విజయ్, వెంకటేశ్, సుధీర్ పాల్గొన్నారు.
News December 15, 2025
మజగన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో 200 పోస్టులు

<
News December 15, 2025
2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

TG: 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. Xలో ఆమె #AskKavitha హ్యాష్ ట్యాగ్‌తో క్వశ్చన్ హవర్ నిర్వహిస్తున్నారు. మీ కొత్త పార్టీ పేరు ఏంటి? అని ఓ నెటిజన్ అడగగా ‘ఎలా ఉండాలి’ అని ఆమె బదులిచ్చారు. జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 2047 నాటికి ఫ్రీ&క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అందించడమే తన విజన్&మిషన్ అని పేర్కొన్నారు.


