News January 7, 2026

నల్గొండ: బైకర్లూ.. హెల్మెట్ల బూజు దులపండి!

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలులోకి రానుంది. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని బంకు యజమానులకు సూచించారు. ప్రాణ రక్షణ కోసం బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Similar News

News February 3, 2026

హాలియాలో హైటెన్షన్.. అభ్యర్థిని గృహనిర్బంధంపై ఘర్షణ

image

హాలియాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రమీలను అధికార పార్టీ నాయకులు గృహనిర్బంధం చేశారన్న ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే భగత్ అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, భగత్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News February 3, 2026

నల్గొండ: చెట్టుపై నుంచి బావిలో పడి కాపరి మృతి

image

కేతేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తుంగతుర్తి గ్రామానికి చెందిన మేకల కాపరి జటంగి సైదులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. సోమవారం మేకల మేత కోసం చెట్టు కొమ్మలు కొడుతుండగా కాలు జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News February 3, 2026

NLG: B.P.Ed &D.P.Ed విద్యార్థులకు గమనిక

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో B.P.Ed & D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్ సంబంధిచి పరీక్షలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు కారణంగా ఆరోజు జరగవలసిన పరీక్షను 13వ తేదీకి రీ-షెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.