News March 8, 2025
నల్గొండ: భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరణ

నల్గొండ పట్టణంలోని ఉస్మాన్‌పురాకు చెందిన హై స్కూల్ అటెండర్ <<15575023>>మహమ్మద్ ఖలీల్<<>> గతనెల 25న మరణించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల సమయంలో ఖలీల్ ఒంటిపై గాయాలను చూసిన కుటుంబ సభ్యులు వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో హత్యేనని రిపోర్టు వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా భార్యే హత్య చేసినట్లు తేలింది. హత్య భార్య చేసిందా లేదా ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 13, 2025
సత్తా చాటిన నల్గొండ పోలీస్

హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజులపాటు నిర్వహించిన 7వ ఆల్ ఇండియా జైళ్ల శాఖ క్రీడల్లో 24 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో నల్గొండ జిల్లా జైలు పోలీస్ మామిడి చరణ్ 80 కిలోల విభాగంలో కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గౌరవం తీసుకొచ్చాడు. ఈ విజయంపై జైలు అధికారులు, పోలీసులు శ్రావణ్, గణేష్, సైదులు, రాంబాబు అభినందనలు తెలిపారు.
News September 13, 2025
నల్గొండ: ఆర్టీసీకి రూ.32.59 లక్షల ఆదాయం

నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా నాలుగు నెలల్లో రూ.32.59 లక్షల ఆదాయం సమకూరిందని ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. జూన్‌లో 22 బస్సులతో రూ. 11.95 లక్షలు, జూలైలో 22 బస్సులతో రూ. 13 లక్షలు, ఆగస్టులో 18 బస్సులతో రూ. 6.47 లక్షలు, సెప్టెంబర్‌లో 3 బస్సులతో రూ. 1.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన వివరించారు.
News September 12, 2025
అధిక ధరకు యూరియా విక్రయిస్తే చర్యలు: ఎస్పీ

యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీపై సరఫరా అవుతున్న యూరియాను ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తే, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.