News April 29, 2024

నల్గొండ, భువనగిరి స్థానాల్లో నలుగురే మహిళలు

image

NLG, BNGRస్థానాల్లో నలుగురు మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి ఎవరూ పోటీలో లేరు. సోషలిస్టు పార్టీ తరఫున సుభద్రరెడ్డి నల్గొండ, భువనగిరి స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థినులుగా పాలకూరి రమాదేవి, పోతుల ప్రార్థన బరిలో నిలవగా.. భువనగిరి నుంచి జంగా సుజాత పోటీలో ఉన్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్నందున పోరులో ఎంత మంది ఉంటారో తేలనుంది.

Similar News

News April 5, 2026

NLG: ఏప్రిల్‌లోనే రూ. 8.50 కోట్ల పన్ను వసూలు!

image

నల్గొండ నగరపాలక సంస్థ ఈ ఏడాది ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 18 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా, కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే రూ. 8.50 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది మొత్తంలో వచ్చే ఆదాయంలో దాదాపు సగాన్ని ఈ ఒక్క నెలలోనే రాబట్టేలా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది.

News April 5, 2026

NLG: ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే రాయితీ!

image

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. జిల్లాలోని నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని భవన యజమానులకు రాయితీ ఇవ్వనున్నారు.

News April 5, 2026

నల్గొండలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

image

NLG: స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ జయంతిని ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్జీ కళాశాల ఎదురుగా, మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహాలకు కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్, గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.