News March 31, 2025
నల్గొండ: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాటిగూడెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. రోజూ తాగి వస్తున్న భర్తతో భార్య అరుణ(35) సోమవారం గొడవకు దిగింది. దీంతో ఆవేశానికి గురైన భర్త గొడ్డలితో ఆమెపై దాడి చేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 2, 2025
బిగ్ బాస్‌లో ఛాన్స్ ఇవ్వాలని ఆర్టిస్ట్ నిరసన

బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ ఓ సినీ ఆర్టిస్ట్ నిరాహార దీక్ష చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో మిర్యాలగూడకు చెందిన రామాచారి అనే నటుడు తాను కూలీ బిడ్డనని, తనకు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రామాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
News April 2, 2025
కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్‌లు

నల్గొండ కేంద్రీయ విద్యాలయంలో 2వ తరగతి నుంచి 9 వరకు ఆఫ్ లైన్‌లో అడ్మిషన్స్ ఈ నెల 2 నుంచి ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను విద్యాలయంలో పొందవచ్చన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 11 చివరి తేది అని పేర్కొన్నారు.
News April 2, 2025
నల్గొండ: రోడ్డుపై కారుతో స్టంట్స్.. యువకుడి అరెస్ట్

నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాల రోడ్డు పై షిఫ్ట్ డిజైర్ కార్‌తో స్టంట్స్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై వేగంగా స్టంట్స్ చేయడంతో ప్రజలు భయాందోనకు గురయ్యారు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ కారును పట్టుకునే ప్రయత్నం చేయగా సదరు యువకుడు కానిస్టేబుల్‌ను కారుతో భయపెట్టి పరారయ్యాడు. కాగా విషయం తెలుసుకున్న 2 టౌన్ పోలీసులు సాయంత్రం అతడిని అరెస్ట్ చేశారు.