News March 22, 2025

నల్గొండ: మద్యం మత్తులో మందుబాబు హల్చల్ 

image

గుర్రంపోడులో మద్యం మత్తులో మందుబాబు వీరంగం సృష్టించాడు. సుమారు అరగంట పాటు నల్గొండ – దేవరకొండ రహదారిపై అడ్డంగా పడుకున్నాడు. స్థానికులు అతడిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ ఇబ్బంది తప్పింది. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చినా మందుబాబు మత్తులో ఉండడంతో వెళ్లిపోయారు. అతను మరోసారి వచ్చి రచ్చ చేయగా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. 

Similar News

News March 23, 2025

NLG: వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో యువకుడి మృతి

image

నేరేడిగొమ్ము వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో బోడుప్పల్‌కు చెందిన యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. HYDకు చెందిన కొందరు యువకులు ఆదివారం రాత్రి వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చారు. ఉదయం కృష్ణా తీరంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ వద్ద పర్యవేక్షణ ఉండదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. 

News March 23, 2025

నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

image

నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. MLG, వేములపల్లి, తిప్పర్తి, హాలియా, NDMNR, కనగల్, మునుగోడు, NKL ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు. 

News March 23, 2025

NLG: మహిళా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

మహిళా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మహిళా రైతులకు రాయితీపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు కోటి 81 లక్షల 36 వేల నిధులను కేటాయించడంతో పాటు 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే మహిళల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు.

error: Content is protected !!