News November 20, 2024

నల్గొండ: మరోసారి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్

image

నేటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం 3 విద్యా సంవత్సరాలుగా ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయి చెల్లించకపోవడంతో మూసివేయాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 65 ప్రైవేట్ కళాశాలలు నేటి నుంచి మూతపడనున్నాయి. రేపటి నుంచి జరిగే డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరించనున్నాయి. తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో నేటి నుంచి మళ్లీ పోరుబాట పట్టనున్నట్లు తెలిపారు.

Similar News

News February 26, 2026

నల్గొండ: మద్యపాన నిషేధ అమలుకు తీర్మానం

image

నార్కట్‌పల్లి మండలం షాపల్లి, అమ్మనబోలు గ్రామాలు బెల్ట్ షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. షాపల్లిలో ఈ నెల 26 నుంచి, అమ్మనబోలులో మార్చి 1 నుంచి బెల్టు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు చేపడతామని పాలకమండలి తీర్మానం చేసింది. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర పల్లెలు స్వాగతిస్తున్నాయి. ఈ సామాజిక మార్పు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News February 25, 2026

దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

image

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా.మాతృనాయక్ బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ డా. రవిప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News February 25, 2026

నల్గొండ: యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలి: కలెక్టర్

image

జిల్లాలో డ్రగ్స్ నివారణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను పాడుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.