News March 5, 2026

నల్గొండ: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ

image

NLG జిల్లాలోని 5,38,650 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, రాబోయే CMR సేకరణకు స్థలం కేటాయించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 1,051 రేషన్ షాపులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News April 20, 2026

NLG: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

వంగమర్తి గ్రామ కార్యదర్శి దేవేందర్ తనను వేధిస్తున్నాడని బాధితుడు భూత్కూరు వెంకటరెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సంబంధించిన యాజమాన్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, కార్యదర్శి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్న కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

image

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.