News March 22, 2025

నల్గొండ మహిళల కోసం జాబ్ మేళా 

image

శ్రీ కాకతీయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో NLG ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 10 తరగతి, ఇంటర్, డిగ్రీ, ITI, పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణులు లేదా ఫెయిల్ అయిన మహిళలు 18 సం.ల నుంచి 33 సంవత్సరాల లోపు వారు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీనివాసరాజు తెలిపారు. 

Similar News

News March 22, 2025

NLG: టెన్త్ పేపర్ లీక్.. ఇన్విజిలేటర్ సస్పెండ్

image

నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్‌లోని ఎస్ఎల్బీసీ బాలిక గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్ర సూపరింటెండెంట్‌ను డ్యూటీ నుంచి తొలగించి, ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు MEO నాగయ్య తెలిపారు. పేపర్ లీకేజీకి సహకరించిన బాలికను కూడా డిబార్ చేశామన్నారు.

News March 22, 2025

ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నల్గొండ అమ్మాయి మృతి

image

రోడ్డుప్రమాదంలో నల్గొండకు చెందిన యువతి మృతిచెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలిలా.. HYDలో MBBS చేస్తున్న తన చెల్లిని తీసుకురావడానికి నల్గొండ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ORRపై కారు టైర్ పగలడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతి చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నల్గొండలోని మీర్ బాగ్, రహమాన్ బాగ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

News March 22, 2025

నల్గొండ: మద్యం మత్తులో మందుబాబు హల్చల్ 

image

గుర్రంపోడులో మద్యం మత్తులో మందుబాబు వీరంగం సృష్టించాడు. సుమారు అరగంట పాటు నల్గొండ – దేవరకొండ రహదారిపై అడ్డంగా పడుకున్నాడు. స్థానికులు అతడిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ ఇబ్బంది తప్పింది. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చినా మందుబాబు మత్తులో ఉండడంతో వెళ్లిపోయారు. అతను మరోసారి వచ్చి రచ్చ చేయగా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. 

error: Content is protected !!