News March 8, 2025
నల్గొండ: మహిళా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసిన ఎస్పీ

మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మహిళా సిబ్బందితో కలిసి తన కార్యాలయంలో సతీమణి పూజతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పురుషులతో సమానంగా మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని, అదేవిధంగా మహిళలందరూ కష్టపడి ఎదుగుతన్నారన్నారు. మహిళా సాధికారతను సాధించాలని.. అప్పుడే ఈ సమాజం మీకు గుర్తింపు ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 9, 2025
సూర్యాపేట SPది మన నల్గొండే..!

సూర్యాపేట జిల్లా ఎస్‌పీగా కే.నరసింహ నియమితులైన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం. మహబూబ్‌నగర్ ఎస్‌పీగా, గవర్నర్ ఏజీసీగా పనిచేసిన నరసింహ కొంతకాలంగా డీఐజీ కార్యాలయానికి అటాచ్ అయి పోస్టింగ్ కోసం నిరీక్షిస్తూ తాజాగా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయి ఎస్‌పీగా వెళ్లారు.
News March 9, 2025
మిర్యాలగూడ: చనిపోయి నలుగురికి పునర్జన్మనిచ్చాడు

మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన సందీప్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ సంస్థ సభ్యులు సందీప్ కుటుంబ సభ్యులను సంపద్రించడంతో వారు అవయవదానానికి ఒప్పుకున్నారు. సందీప్ గుండె, కాలేయం, కిడ్నీలు, కార్నియా సేకరించారు. సందీప్ మరణించినప్పటికీ అవయవదానం చేసి మరో నలుగురికి పునర్జన్మను ఇచ్చారని పలువురు సందీప్ కుటుంబ సభ్యులను అభినందించారు.
News March 9, 2025
చిట్యాల సమీపంలో యాక్సిడెంట్

చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో యాక్సిడెంట్ జరిగింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఉదయం నార్కెట్ పల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు.