News March 21, 2026
నల్గొండ- మాచర్ల రైల్వే మార్గంపై వీడని నిరీక్షణ

నల్గొండ నుంచి హాలియా మీదుగా మాచర్ల వరకు రైల్వే లైన్ కల సాకారం కోసం సాగర్ ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్లలో కేంద్రం రూ.2 కోట్లు కేటాయించి, రెండుసార్లు సర్వే నిర్వహించినా పనులు మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి, ఈ నిరీక్షణకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News April 4, 2026
ఒరాకిల్ బాస్‌కు ₹18 లక్షల కోట్ల లాస్

ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎలిసన్ గత 6 నెలల్లో ఊహించని రీతిలో నష్టపోయారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయన $393 బిలియన్లతో సంపద విషయంలో మస్క్‌నే వెనక్కి నెట్టారు. కానీ ఇప్పుడు ఆయన నెట్ వర్త్ $195 బిలియన్లకు పడిపోయింది. దాదాపు ₹18 లక్షల కోట్లు నష్టపోయారు. ఒరాకిల్ షేరు విలువ 50% పైగా కుప్పకూలడమే ఇందుకు కారణం. ఏకంగా 50% సంపద కోల్పోవడం గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ‘డౌన్‌ఫాల్’ అని నిపుణులు అంటున్నారు.
News April 4, 2026
NLG: పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. సరైన సంరక్షణ చర్యలు లేక వేసవిలో తీవ్ర నీటి ముప్పు పొంచి ఉంది. జనవరి నుంచి మార్చి నాటికి జిల్లాలో 1.17 మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. మార్చికి నల్గొండలో 6.69, సూర్యాపేటలో 6.99, యాదాద్రిలో 7.73 మీటర్లకు జలాలు చేరాయి. అత్యధికంగా యాదాద్రిలో 2.24 మీటర్లు, సూర్యాపేటలో 2.12 మీటర్ల మేర నీరు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
News April 4, 2026
జీఎస్టీ వసూళ్లలో TOP-6లో కడప డివిజన్

కడప డివిజన్లో జీఎస్టీ వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.851.44 కోట్లు రాగా.. 2025-26లో రూ.932.83 కోట్లు వచ్చాయని SGST కడప జాయింట్ కమిషనర్ సుమతి తెలిపారు. నెలకు సగటున రూ.70.95 కోట్లు జీఎస్టీ వసూలయ్యాయి. రూ.82.38 కోట్ల పెరుగుదల నమోదైంది. రూ.2025 మార్చిలో రూ.73.31 కోట్లు రాగా.. 2026 మార్చిలో రూ.84.39 కోట్లకు పెరిగాయి. గత నెలలో SGST నగదు వసూళ్లలో రూ.38.79 కోట్లతో స్టేట్‌లో కడప టాప్-6లో నిలిచింది.


