News December 21, 2025

నల్గొండ: మీరు మారరా..?

image

ఉమ్మడి జిల్లాపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. అవినీతికి అండగా నిలిచే ప్రధాన శాఖలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15కు పైగానే కేసులు నమోదయ్యాయి. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఏసీబీ వరుసగా దాడులు చేస్తూ జైలుకు పంపుతున్నా, చాలామంది అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.

Similar News

News December 24, 2025

కర్నూలు SP కీలక నిర్ణయం

image

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

News December 24, 2025

మహిళలపై ఇన్ఫ్లమేషన్ ప్రభావం

image

ఇన్‌ఫ్లమేషన్ అంటే సాధారణ భాషలో వాపు అని అర్థం. క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, ఆర్థరైటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి అనేక వ్యాధులకు ఇది కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల్లో జననాంగ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఫైబ్రాయిడ్లు, జీర్ణ సమస్యలు, చర్మసమస్యలు వంటివి వస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గాలంటే స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 24, 2025

KNR: “వినియోగదారుడా మేలుకో”.. అడగటం నీ హక్కు

image

నేటి మార్కెట్ వ్యవస్థలో వినియోగదారుడే రాజు అని అంటారు. కానీ, ఆచరణలో మాత్రం తూకాల్లో తేడాలు, నాణ్యత లేని వస్తువులు, తప్పుడు ప్రకటనలతో వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై అవగాహన లేకపోవడం, “ఎవరు పోరాడుతారులే” అనే నిర్లక్ష్యం వ్యాపారులకు వరంగా మారుతోంది. కరీంనగర్ జిల్లాలో వినియోగదారుల కోర్టు ఉన్నా దాని వినియోగం చాలా అంటే చాలా తక్కువ. నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం.