News March 29, 2025
నల్గొండ: ముగ్గురు పిల్లలు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే.<<>> RR జిల్లా తలకొండపల్లికి చెందిన చెన్నయ్య 2012లో నల్గొండ జిల్లా మందాపూర్ వాసి రజితను పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం పొద్దున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 31, 2025
నల్గొండ: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాటిగూడెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. రోజూ తాగి వస్తున్న భర్తతో భార్య అరుణ(35) సోమవారం గొడవకు దిగింది. దీంతో ఆవేశానికి గురైన భర్త గొడ్డలితో ఆమెపై దాడి చేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 31, 2025
NLG: టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మిగతా ఆరుగురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక పనులకు ఆటంకంగా ఉన్న స్టీల్‌ను తొలగిస్తూ లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటికి తరలిస్తున్నారు. సొరంగం లోపల అత్యధికంగా ఉన్న మట్టిని తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు.
News March 31, 2025
NLG: వ్యవసాయ అనుసంధాన పనులకూ ‘ఉపాధి’

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించారు. తాజాగా వ్యవసాయ అనుసంధాన పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా పంట పొలాల వద్దకు మట్టి రోడ్లు, పండ్ల తోటల పెంపకం, పశువుల కొట్టాలు, కోళ్లఫారాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. NLG జిల్లాలో సుమారు నాలుగు లక్షల జాబ్ కార్డులు ఉండగా.. సుమారు ఎనిమిది లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు.