News January 12, 2026
నల్గొండ: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం: కలెక్టర్

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. CSతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ముగిసిందని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
నల్గొండ: M. Ed విద్యార్థులకు అలర్ట్

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed semester-3 (R-23) రెగ్యులర్‌కు సంబంధించిన పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి-10 నుంచి ఫిబ్రవరి-23 మధ్య జరుగుతాయి అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని కోరారు.
News January 20, 2026
నల్గొండ: రోడ్డు భద్రతే లక్ష్యం-‘అరైవ్ అలైవ్ 2026’ ప్రారంభం

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్ 2026” అవగాహన సదస్సును ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. గతేడాది జిల్లాలో 950 ప్రమాదాలు జరగ్గా, 360 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వాహనదారులు, యువత పాల్గొన్నారు.
News January 20, 2026
NLG: చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు

నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 52 రోజులకు గాను గట్టుపైన రూ.28,98,762, గట్టు కింద అమ్మవారి ఆలయంలో రూ.3,85,695, (మొత్తం రూ.32 లక్షల 84 వేల 457) ఆదాయం వచ్చింది. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఈవో ఎస్ మోహన్ బాబు, దేవాదాయశాఖ పరిశీలకులు సుమతి పాల్గొన్నారు.


