News February 16, 2026

నల్గొండ: మున్సిపల్ ఎన్నికల్లో బీసీల హవా

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు అద్భుత విజయం సాధించారు. మొత్తం 17 మున్సిపాలిటీల్లోని 329 వార్డులకు గాను, 184 చోట్ల (56 శాతం) బీసీలు గెలుపొందారు. నల్గొండ కార్పొరేషన్‌లో ఏకంగా 60 శాతం డివిజన్లను కైవసం చేసుకున్నారు. కేవలం రిజర్వ్‌డ్ స్థానాల్లోనే కాకుండా, జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి సత్తా చాటారు. ఈ ఫలితాలు జిల్లా రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పాయి.

Similar News

News February 16, 2026

వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షించిన భద్రాద్రి కలెక్టర్

image

కార్పొరేషన్ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు అమోయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన ఐడీఓసీ కార్యాలయం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.

News February 16, 2026

నారాయణపేటలో వికసించిన కమలం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మున్సిపల్ ఛైర్మన్ స్థానం బీజేపీ దక్కించుకుంది. మొత్తం 11 మంది బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ రెబల్ అభ్యర్థిగా విజయం సాధించిన జయశ్రీ సొంత పార్టీలో చేరగా బలం 12కు చేరింది. దీంతో ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో ఛైర్మన్ స్థానం బీజేపీ సొంతమైంది. ఛైర్‌పర్సన్‌గా కొండా శ్వేత, వైస్ ఛైర్‌పర్సన్‌గా మంజుల ప్రమాణ స్వీకారం చేశారు.

News February 16, 2026

పార్వతీపురం జిల్లా పోలీస్ గ్రీవెన్స్‌కు 11 ఫిర్యాదులు

image

ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని పార్వతీపురం అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.