News March 21, 2025

నల్గొండ: మూల్యాంకనం తేదీలో మార్పు..!

image

ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి ఈనెల 22న జరగాల్సిన మూల్యాంకనం 21వ తేదీ (శుక్రవారం)కి మార్చినట్లు డీఐఈఓ దస్రూ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామినర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News March 27, 2025

NLG: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం NLG, SRPT, BNGR డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

News March 27, 2025

నకిరేకల్: ఎగ్జామ్స్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్

image

తన <<15867903>>డిబార్‌ను రద్దు<<>> చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని శాలిగౌరారానికి చెందిన ఝాన్సీలక్ష్మి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, NLG DEO, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నకిరేకల్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారని విద్యార్థిని పేరెంట్స్ తెలిపారు. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.

News March 26, 2025

నల్గొండ: 3 జిల్లాలకు 3 మంత్రి పదవులు..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్, బీసీ వర్గం నుంచి బీర్ల ఐలయ్య ఉన్నారు. అయితే సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ్, నల్గొండ నుంచి కోమటిరెడ్డి మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఐలయ్యను క్యాబినెట్‌లోకి తీసుకుంటే భువనగిరి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం దక్కినట్లు అవుతుంది. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరు కూడా అమాత్య పదవి రేసులో ఉన్నట్లు చర్చ సాగుతుంది.

error: Content is protected !!