News October 7, 2025
నల్గొండ: మైనర్ హత్యాచారం.. పోక్సో కేసు నమోదు

నల్గొండ మండలంలో బాలిక హత్యాచార ఘటనపై పోక్సో కేసు నమోదైంది. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గదికి తీసుకెళ్లి హత్యాచారం చేశాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు తక్షణమే నిందితుడు కృష్ణతో పాటు అతని స్నేహితుడిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 8, 2025
NLG: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన హైకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో నల్గొండ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 33 జడ్పీటీసీ, 33 ఎంపీపీ పదవుల భవితవ్యాన్ని, అలాగే 353 ఎంపీటీసీ స్థానాలు, 869 గ్రామ సర్పంచుల స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News October 7, 2025
NLG: అధిక వడ్డీ దందా.. తెర వెనుక మరో వ్యక్తి..!

పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్ <<17937867>>అధిక వడ్డీ<<>> ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేసి పరారీలో ఉండగా అతని ఇంటిపై బాధితులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దందా వెనుక మధు అనే మరో యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాలాజీ నాయక్‌తో కలిసి మధు అనే యువకుడు గ్రామీణ ప్రజలే లక్ష్యంగా ఈ దందా నడిపినట్లు సమాచారం. బాలాజీ కంటే మధునే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
News October 7, 2025
నల్గొండలో ఉర్సు.. ఏర్పాట్లు పరిశీలన

నల్గొండలో ఈ నెల 9 నుంచి జరిగే హజరత్ లతీఫ్ షా వలీ ఉర్స్-ఏ-షరీఫ్ వలి ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.