News March 17, 2025

నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

image

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 7, 2025

నంద్యాల: ఉచితంగా స్కూటీలు

image

దివ్యాంగుల సంక్షేమానికి CM చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రభుత్వ టెలికాం అడ్వైజరి కమిటీ మెంబర్ రమేశ్ పేర్కొన్నారు. గురువారం పాములపాడులో మీడియాతో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు ఉచితంగా రెట్రో పిట్టెడ్ మోటార్ సైకిల్స్‌ను సీఎం ఉచితంగా అందజేస్తున్నారన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.apdascac.ap.gov.in వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.

News November 7, 2025

అరక అరిగిన గరిసె విరుగును

image

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.

News November 7, 2025

పెళ్లి ఏ వయస్సులో చేసుకోవాలి?

image

అమ్మాయిలు 18, అబ్బాయిలు 21 ఏళ్లు దాటాక వివాహం చేసుకోవాలని సనాతన ధర్మం బోధిస్తోంది. దీని వెనుక ఆధ్యాత్మిక ఆంతర్యం కూడా ఉంది. వివాహ జీవితం సక్రమంగా సాగాలంటే శారీరక బంధం ఉంటే సరిపోదు. మానసిక, ఆధ్యాత్మిక పరిణతి కూడా చెంది ఉండాలి. పూర్వం యువతీ యువకులు వేదాలనభ్యసించి, జ్ఞానాన్ని, ధర్మాన్ని తెలుసుకున్నాకే పెళ్లి చేసుకునేవారట. ఇది ధర్మాన్ని నిలబెట్టి, మోక్ష మార్గానికి బాటలు వేస్తుందని నమ్మకం. <<-se>>#Sanathanam<<>>