News January 2, 2026

నల్గొండ: రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు!

image

ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ మాసంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. గతనెలలోనే ఒకపక్క కొత్త మద్యం షాపులు తెరుచుకోవడం, మరో పక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు, థర్టీ ఫస్ట్ వేడుకలు జరగడంతో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. దీంతో ఒక్క నెలలోనే నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 245 మద్యం షాపుల ద్వారా రూ.452 కోట్ల వ్యాపారం సాగింది. గతేడాది కంటే ఈ డిసెంబర్ నెలలోనే రూ.167 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది.

Similar News

News January 3, 2026

టెక్కలి: డివైడర్‌పై వృద్ధుడి మృతదేహం

image

టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రహదారి డివైడర్‌పై శుక్రవారం ఒక వృద్ధుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మండలంలోని కంట్రగడ గ్రామానికి చెందిన వీ.ఆనంద్ (71) అనే వృద్ధుడు కొన్నేళ్లుగా టెక్కలిలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మేరకు కాంప్లెక్స్ సమీపంలోని మృతిచెంది పడి ఉండడంతో స్థానికులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. అనారోగ్య సమస్యతో మృతిచెంది ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.

News January 3, 2026

కూతురిపై అత్యాచారం.. పొక్సో కేసు నమోదు: CI

image

కన్న కూతురిపై తండ్రే అత్యాచారం చేసిన దారుణం పెద్దపంజాణిలో చోటుచేసుకుంది. పలమనేరు(R) CI పరశురాముడు కథనం మేరకు.. ST కాలనీకి చెందిన పెద్దబ్బకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమార్తె చికెన్ తీసుకుని వెళ్తుండగా ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లాడు. అడ్డుకున్న నానమ్మపై దాడి చేశాడు. ఆమె గ్రామంలోకి వెళ్లి బంధువులను పిలుచుకుని రాగా అప్పటికే అత్యాచారం చేసి పారిపోయాడు. నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేశారు.

News January 3, 2026

ప్యూరిఫైయర్లపై GST కట్? సామాన్యులకు భారీ ఊరట!

image

వాయు కాలుష్యం, కలుషిత నీటి సమస్యల తీవ్రత నేపథ్యంలో ఎయిర్, వాటర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించాలని కౌన్సిల్ యోచిస్తోంది. ప్రస్తుతం వీటిపై 18% పన్ను ఉండగా దాన్ని 5%కి తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల ధరలు తగ్గి సామాన్యులకు ఇవి మరింత అందుబాటులోకి వస్తాయి. రాబోయే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వీటిని ‘లగ్జరీ’ కేటగిరీ నుంచి ‘అవసరమైన’ వస్తువులుగా గుర్తించనున్నారు.