News January 14, 2026
నల్గొండ: రైస్ మిల్లులు.. అక్రమాలకు నిలయాలు!

ప్రభుత్వ ధాన్యం మళ్లింపును అరికట్టేందుకు తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు రెండు రోజుల వ్యవధిలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా సుమారు రూ.60 కోట్లకు పైగా విలువైన సీఎమ్ఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 8 బృందాలు నల్గొండ, సూర్యాపేటతో పాటు 10 జిల్లాల్లోని 19 రైస్ మిల్లుల్లో తనిఖీ చేశారు.
Similar News
News February 6, 2026
నేడు కర్నూలు జిల్లా పర్యటనకు CM

సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగొట్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 11:25 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుని, 11:40కి గ్రామసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం వారికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. సుమారు 1200 మంది పోలీసులతో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయంలో జేసీ తనిఖీ

బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయాన్ని జేసీ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు. వెబ్ ల్యాండ్ అడంగల్‌లో క్లైమ్ చేయని, ఇతరుల పేరిట ఉన్న మిగులు భూముల వివరాలను పరిశీలించారు. గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి పత్రాలు సేకరించాక, రికార్డుల ఆధారంగా మ్యూటేషన్ చేస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.