News April 23, 2025
నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

తిప్పర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. నర్సింగ్ బట్లకి చెందిన రవి (30) పెళ్లి మండపం కట్టడానికి మంగళవారం రాత్రి మిర్యాలగూడ వెళ్లాడు. ఈ తెల్లవారుజామున బైక్‌పై తిరిగి వస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి కిందపడ్డాడు. అతని పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్గొండ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News April 23, 2025
NLG. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కవలలు

ఇంటర్ ఫలితాలలో నల్గొండకు చెందిన విద్యార్థినులు( కవలలు) దుర్గాంజలి, అఖిల సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 466/470, 461/470 మార్కులు సాధించారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అత్యధిక మార్కులు సాధించినందుకు ఆనందంగా ఉందని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు సహకరించిన తల్లిదండ్రుల, గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.
News April 23, 2025
NLG: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్‌ను సంప్రదించగలరు.
News April 23, 2025
NLG: కొనసాగుతున్న ఓపెన్ ఇంటర్ పరీక్షలు

నల్గొండ జిల్లాలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నిర్వహించిన పొలిటికల్ సైన్స్ పరీక్షకు 1454 మంది విద్యార్థులకు గాను,1238 మంది పరీక్ష కు హాజరు కాగా, 216 మంది పరీక్షకు గైరాజరయ్యారు. అదేవిధంగా గణితం పరీక్షకు1481 మందికి 1252 మంది హాజరు కాగా,122 మంది గైర్హాజరయ్యారు. కెమిస్ట్రీ పరీక్షకు 467 మందికి 397 మంది హాజరు కాగా, 70 మంది గైర్హాజరైనట్లు డీఈవో బిక్షపతి తెలిపారు.