News March 17, 2025
నల్గొండ: వచ్చే నెల నుంచే సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్

తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుంది అన్నారు. వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని, కాంగ్రెస్ మాటలు చెప్పేది కాదు, చేతల్లో చూపెడుతుందని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతున్నామని అన్నారు.
Similar News
News November 6, 2025
సాగర్‌లో నేటి నుంచి బీసీ గురుకులాల క్రీడలు

నాగార్జునసాగర్ హిల్ కాలనీలో గల మహాత్మాజ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాలలో గురువారం నుంచి బీసీ గురుకుల పాఠశాలల, కళాశాలల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే పోటీల్లో అండర్-14, 17, 19 విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు అండర్ -14 విభాగాలకు క్రీడలు నిర్వహిస్తామన్నారు.
News November 6, 2025
ఇక మహానగరంగా మన నల్గొండ..!

నల్గొండ త్వరలో మహానగరంగా రూపుదిద్దుకోనుంది. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. 1951లో NLGను 12 వార్డులతో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనాభా పెరగడం, పట్టణం క్రమంగా విస్తరించింది. 2011లో విలీన గ్రామాలను కలిపి 48 వార్డులను 50 డివిజన్లుగా విభజించనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 2.25 లక్షలకు పైగా జనాభా ఉన్నారు.
News November 5, 2025
NLG: ఇంటర్ కళాశాలపై నిఘా…..!

జిల్లాలో సర్కారు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఇంటర్ బోర్డు నిఘా పెట్టింది. సర్కారు కళాశాలల్లో ఇప్పటికే ప్రక్షాళన చేసిన ప్రభుత్వం ఆచరణలో క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనానికి చర్యలు చేపట్టింది. దీంతో పాటు వేలల్లో ఫీజులు చెల్లిస్తున్న ప్రైవేట్ కళాశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని 140 కళాశాలలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.


