News May 7, 2025

నల్గొండ: విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్నేహితులు మృతి

image

నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో <<16216733>>తీవ్రవిషాదం<<>> చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బింగి మత్స్యగిరి (20), మర్రి శివకుమార్(21) ఇద్దరు స్నేహితులు బైక్‌పై వెళ్తూ స్తంభానికి డీకొట్టారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో స్నేహితుని వివాహం సందర్భంగా వచ్చి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని మునుగోడు ఎస్ఐ రవి సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News July 5, 2025

BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

image

నల్గొండ జిల్లా కట్టంగూరులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. శాలిగౌరారం మండలం ఊట్కూరు వాసి రజనీకాంత్ HYDలో ఉంటూ పని చేస్తున్నాడు. ఈరోజు స్వగ్రామంలో బంధువు చావుకు వచ్చి, తిరిగి HYDకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 5, 2025

NLG: వన మహోత్సవానికి సిద్ధం

image

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 68.70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

News July 5, 2025

NLG: 8 నుంచి పోస్టల్‌లో కొత్త సాఫ్ట్వేర్

image

పోస్టల్ డివిజన్లోని NLG, యదాద్రి BNG జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద NLG డివిజన్లోని 2 హెడ్ ఆఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్‌లు, 392 పోస్టాఫీస్‌లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.