News October 21, 2025

నల్గొండ: వీరికి స.హ. చట్టం అంటే లెక్కే లేదు!

image

జిల్లాలో ఆర్టీఐ దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. స.హ. చట్టం అమలు కోసం ఏర్పడిన సమాచార కమిషన్ సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు విధిస్తున్నా.. వీరి తీరు మారడం లేదు. NLG(M) దండెంపల్లికి చెందిన టీ.ప్రవీణ్ కుమార్ 2018లో దండెంపల్లిలోని సర్వే నంబర్ 154/10కి సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులు ఆ ఫైల్ లభ్యం కాలేదని సమాచారం ఇచ్చారు.

Similar News

News October 21, 2025

విశాఖకు గూగుల్ రావడం జగన్‌కు ఇష్టం లేదనిపిస్తోంది: మాధవ్

image

AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తూ YS జగన్‌ కనీసం ట్వీట్ కూడా చేయలేదని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆక్షేపించారు. గూగుల్ పెట్టుబడులు రావడం ఆయనకు ఇష్టం లేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తుంటే ఎందుకు స్వాగతించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. యువతకు మంచి అవకాశాలు రాబోతున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారు ఫలితాలు రుచిచూపిస్తున్నామని చెప్పారు.

News October 21, 2025

పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: రాచకొండ సీపీ

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అంబర్‌పేట్ కార్ హెడ్‌క్వార్టర్‌లో సీపీ సుధీర్ బాబు, డీసీపీలు, సీనియర్ అధికారులతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని తెలిపారు.