News January 10, 2026

నల్గొండ: వేరే రాష్ట్రంలో దాక్కున్నా.. పోలీసులు వదల్లేదు

image

రెప్పపాటులో ప్రయాణికుల ఆభరణాలను మాయం చేసే అంతరాష్ట్ర ‘థార్’ ముఠా దొంగతనం ఉదంతాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 15రోజుల పాటు మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాను జల్లెడ పట్టినCCS బృందం, ముఠా సభ్యుడైన షా అల్లా రఖాను అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.

Similar News

News February 16, 2026

నల్గొండ: MIMలో చేరిన కార్పొరేటర్

image

నల్గొండ పురపాలక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 26వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ మొయినా భాయ్ హైదరాబాద్‌లో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో MIM తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 107 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు తిరిగి పతంగి గూటికి చేరారు.

News February 15, 2026

నల్గొండ: గ్రామీణ ప్రతిభకు ‘సీఎం కప్’ వేదిక: కలెక్టర్

image

గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ‘సీఎం కప్’ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఈ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. సరైన వేదికలు లేక వెనుకబడుతున్న గ్రామీణ క్రీడాకారులకు ఇది గొప్ప అవకాశమని, పట్టుదలతో ఆడి జిల్లాకు కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

News February 15, 2026

NLG: అంగన్వాడీలపై ఇక పటిష్ఠ నిఘా

image

అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తోంది. ఆయా కేంద్రాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలతో పాటు ప్రీస్కూల్, పోషకాహార పంపిణీ తదితర కార్యక్రమాలను ఈ కమిటీలు నిత్యం పర్యవేక్షించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండున్నరేళ్లుగా గ్రామాల్లో సర్పంచులు లేక గతంలో ఉన్న కమిటీలు అంతగా పనిచేయ లేదు.