News November 14, 2024
నల్గొండ: వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. రామన్నగూడెం వాసి రాములు(59) తుంగతుర్తి శివారులో బైక్ ఢీకొట్టడంతో మృతిచెందారు. అటు రంగారెడ్డి జిల్లాకి చెందిన అభిలాశ్(24) చౌటుప్పల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చనిపోయాడు. తిప్పర్తి (M) మల్లేవారిగూడానికి చెందిన కొండయ్య పొలం పనికి వెళ్తున్న క్రమంలో మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో స్పాట్‌లో మృతిచెందాడు.
Similar News
News December 18, 2025
పీఏ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్సై విజయ బాయి

మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పీఏ పల్లి మండలం అంకంపేట, అంగడిపేటలో విధులు నిర్వహించిన మహిళా ఎస్సై విజయబాయి మానవత్వం చాటుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన వికలాంగులు, వయోవృద్ధులను వీల్ చైర్‌లో కూర్చోబెట్టి స్వయంగా పోలింగ్ రూమ్ వద్దకు తీసుకెళ్లింది. నిధి నిర్వహణలో ఉండి కూడా వృద్ధులు, వికలాంగులకు చేయూతనివ్వడం పట్ల పలువురు ఎస్సై విజయ బాయిని అభినందించారు.
News December 17, 2025
నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

నేరేడుగొమ్ము మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. చిన్నమునిగల్ గ్రామపంచాయతీలో మొదటి ఫలితం వెలువడింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఆయన బాబుపై 102 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
News December 17, 2025
నల్గొండ: ఆ గ్రామ పంచాయతీల్లో దంపతులదే హవా..!

తిప్పర్తి మండలంలోని 4 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో దంపతుల హవా కొనసాగింది. రెండో దశ ఎన్నికల్లో 2019లో సోమోరిగూడెంలో కోన రజిత గెలవగా, ప్రస్తుతం ఆమె భర్త కోన వెంకన్న, రామలింగాల గూడెంలో ముత్తినేని శ్రీదేవి, ప్రస్తుతం ఆమె భర్త శ్యాంసుందర్, ఎర్రగడ్డలగూడెంలో ఎల్లాంల శైలజ, ప్రస్తుతం ఆమె భర్త సతీష్ రెడ్డి, జొన్నలగడ్డ గూడెంలో నామిరెడ్డి వెంకటరామిరెడ్డి, ప్రస్తుతం ఆయన భార్య అనురాధ విజయం సాధించారు.


