News March 10, 2025
నల్గొండ: శాసనమండలిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఇదే తొలిసారి!

తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఏర్పడ్డ ఎమ్మెల్సీ స్థానాల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీపీఐ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించింది. అందులో భాగంగా సీపీఐ నుంచి నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెంకు చెందిన యాదవ సామాజికవర్గం నెల్లికంటి సత్యం పేరును ప్రకటించింది.
Similar News
News March 10, 2025
కృష్ణా జిల్లాలో రాత్రి గస్తీ కట్టుదిట్టం

కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్ ఆదేశాలతో ఆదివారం రాత్రి గస్తీ పటిష్ఠంగా కొనసాగుతోంది. నేర నియంత్రణ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు అనుమానిత వాహనాలు, ప్రయాణికుల తనిఖీ, సీసీ కెమెరాల పర్యవేక్షణ చేపట్టారు. హైవేలపై డ్రైవర్లకు అవగాహన కల్పించి, బస్టాండ్లు, లాడ్జిలలో కొత్త వారి వివరాలు సేకరిస్తున్నారు.
News March 10, 2025
HYD: సీఎంని కలిసిన అద్దంకి దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు.
News March 10, 2025
నల్గొండ: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు

ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సోమవారం అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.