News December 5, 2025
నల్గొండ: సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని

కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బోయపల్లి అనూష(21) పోటీ చేస్తున్నారు. అనూష తండ్రి బోయపల్లి జానయ్య గతంలో ఉమ్మడి చర్ల గౌరారం ఎంపీటీసీగా పనిచేశారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని అనూష తెలిపారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే మార్పు వస్తుందని ఆమె ఆకాంక్షించారు.
Similar News
News December 5, 2025
సీఎం స్టాలిన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాలిన్‌తో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.
News December 5, 2025
SVU: పరీక్ష ఫలితాలు విడుదల.!

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc 3, 4 M.A హిస్టరీ, సోషల్ వర్క్, హ్యూమన్ రైట్స్ ఉమెన్ స్టడీస్ మొదటి సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం (SVU DDE) ఆధ్వర్యంలో B.LI.Sc పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.
News December 5, 2025
కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్‌తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.


