News November 30, 2025
నల్గొండ: సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి: KVPS

బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ పట్టణంలో ప్రజా నిరసన సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్ల పేరుతో అమాయకుల ప్రాణాలను తీస్తున్నారని ఆరోపించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
Similar News
News April 14, 2026
దేవరకొండ: పరారీలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి మంతనాలు!

దేవరకొండలోని ఓ జాతీయ బ్యాంకులో ఖాతాదారుల సొమ్ము కాజేసి పరారైన కాంట్రాక్టు ఉద్యోగి, రాష్ట్ర ఉద్యోగ సంఘ నేతతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల ఐడీలతో నిధులు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం సొమ్ము భద్రంగానే ఉందని తెలిపారు. రహస్యంగా దర్యాప్తు చేస్తూ, సదరు ఉద్యోగిని పట్టుకుని మిగిలిన సిబ్బందిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
News April 14, 2026
ఏడేళ్ల తర్వాత ‘ఇంటి పన్ను’ లెక్కలు షురూ!

జిల్లాలో గ్రామ పంచాయతీల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంటి పన్నుల పునఃమదింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2018లో చివరిసారిగా జరిగిన ఈ ప్రక్రియ, మళ్లీ ఇప్పుడు పట్టాలెక్కుతోంది. ఇండ్ల కొలతలు, నిర్మాణాల్లో మార్పులు, కొత్తగా నిర్మించిన భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. 849 పంచాయతీల్లో ఈ ప్రక్రియ ద్వారా అదనంగా సుమారు రూ.2 కోట్లు ఆదాయం రానున్నది.
News April 14, 2026
NLG: డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని NLGలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ శ్రీనివాసరాజు, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


