News October 8, 2025

నల్గొండ: స్కిల్ కాంపిటీషన్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోండి

image

ప్రపంచ స్కిల్‌ కాంపిటీషన్‌లో (World Skill Competition) పాల్గొని, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువత ఈ నెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 24 ఏళ్ల వయస్సు వారు, నైపుణ్యం కలిగిన నిరక్షరాస్యులు కూడా అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు http://www.skillindiadigital.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 8, 2025

NLG: పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

image

పత్తి కొనుగోళ్లకు నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఇప్పటికే సీసీఐ, మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిన్నింగ్ వ్యాపారులు, CCI మధ్య నిబంధనలపై ఒప్పందం కుదరడంతో సంక్షోభం తొలగిపోయింది. జిల్లాలో ఈ సీజన్లో 5.64 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగైంది.

News October 8, 2025

NLG: వరుస వర్షాలతో తెల్ల బంగారానికి తెగుళ్లు!

image

జూన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షం 526.6 మిల్లీమీటర్లు కాగా 670.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అతివృష్టి కారణంగా జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పత్తి పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. పత్తి ఏరే సమయంలో గత రెండు మూడు రోజుల నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి చేలు ఎర్ర భారీ తెగుళ్ల బారిన పడ్డాయి.

News October 8, 2025

NLG: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన హైకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో నల్గొండ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 33 జడ్పీటీసీ, 33 ఎంపీపీ పదవుల భవితవ్యాన్ని, అలాగే 353 ఎంపీటీసీ స్థానాలు, 869 గ్రామ సర్పంచుల స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.