News December 2, 2025

నల్గొండ: స్టోన్ క్రషర్స్ యజమానుల సమ్మె బాట షురూ!

image

నల్గొండ జిల్లాలో స్టోన్ క్రషర్స్ యజమానులు సమ్మెబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో స్టోన్ క్రషర్ మిల్లులు నడపటం కష్ట సాధ్యంగా మారిందని వాటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి జిల్లాలోని స్టోన్ క్రషర్స్ మిల్లులను బంద్ పెట్టిన వాటి యజమానులు సమ్మెబాట పట్టారు.

Similar News

News March 9, 2026

నారాయణపేట బంగారానికి జీఐ ట్యాగ్..!

image

బంగారానికి, చేనేత చీరలకు దేశంలోనే నారాయణపేట ప్రసిద్ధి గాంచింది. అలాంటి బంగారానికి జీఐ ట్యాగ్ (భౌగోలిక సూచి) గుర్తింపు కోసం ఇక్కడి బంగారు వ్యాపారస్థులు కృషి చేస్తున్నారు. ఇక్కడి బంగారు వ్యాపారానికి 130 ఏళ్ల చరిత్ర కలిగింది. సుమారు 150 బంగారు దుకాణాలు ఉండగా, 270 మందికిపైగా బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు ఉన్నారు. 24 క్యారెట్ల బంగారంతో అధునాతన డిజైన్లు చేయగల ఘనత ఇక్కడి స్వర్ణకారుల సొంతం.

News March 9, 2026

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రయల్ కోర్ట్ తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవితలతో సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇటీవల వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.

News March 9, 2026

లాభాల పేరిట భారీ స్కామ్స్: పల్నాడు ఎస్పీ

image

సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఇన్వెస్ట్‌మెంట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో అధిక లాభాల ఆశచూపి కేటుగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారని తెలిపారు. తెలియని వ్యక్తులు ఇచ్చే ట్రేడింగ్ టిప్స్ నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. బాధితులు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.