News October 11, 2025
నల్గొండ: స్పందన కరువు: పెరిగిన ఫీజే కారణం?

జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులకు స్పందన కరువైంది. 2025–27 సంవత్సరానికి 154 దుకాణాలకు గాను ఇప్పటివరకు కేవలం 96 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2023లో 155 షాపులకు 7,037 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం దరఖాస్తు ఫీజును భారీగా పెంచడం వల్లే ఈసారి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గత నెల 26న ఎక్సైజ్ శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Similar News
News October 11, 2025
‘వాడపల్లి ఎస్సైపై చర్యలు’ కథనం అవాస్తవం: ఎస్పీ

వాడపల్లి ఎస్సై, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినట్లుగా ప్రచురించిన వార్తల్లో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేస్తే, సంబంధిత వ్యక్తులు, పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అవాస్తవ కథనాలు ప్రచురించడం తగదని సూచించారు.
News October 11, 2025
NLG: కమీషన్ డబ్బులు ఇచ్చేది ఎప్పుడో!?

రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. నెలల తరబడి కమీషన్ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దుకాణాల అద్దెలు సైతం కట్టలేకపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కమీషన్ చెల్లింపులు ఆలస్యం కావడంతో జిల్లాలో 997 రేషన్ షాపుల డీలర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి కమీషన్ బకాయిలను చెల్లించాలని కోరారు.
News October 11, 2025
NLG: ఎవరైనా టెండర్ వేయొచ్చు.. భయపడొద్దు

కొత్త పాలసీ ప్రకారం మద్యం దుకాణాలకు అర్హులంతా నిర్భయంగా దరఖాస్తు చేయాలని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. జిల్లాలో 154 దుకాణాలకు ST వర్గానికి 4, SC వర్గానికి 14, గౌడ సామాజిక వర్గానికి 34 దుకాణాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్ల దుకాణాలకు తమ సంఘాలతో కలిసి మాత్రమే టెండర్ వేయాలని ఇతరులతో కలిసి వేయరాదంటూ కొందరు ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.