News January 3, 2026

నల్గొండ: 10 నెలలు.. 1,47,184 రేషన్ కార్డులు

image

ఉమ్మడి నల్గొండలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గడిచిన 10 నెలల్లోనే ప్రభుత్వం కొత్తగా 1.47 లక్షల మందికి పైగా కార్డులను మంజూరు చేసింది. గత జనవరిలో 10.06 లక్షలుగా ఉన్న కార్డుల సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులని తేలితే చాలు, అధికారులు వెంటనే కార్డులను ఓకే చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 22 వరకు 1,47,184 కార్డులు జారీ అవ్వడం గమనార్హం.

Similar News

News January 5, 2026

తంతడి తీరంలో సముద్రపు నాచు సాగు ప్రారంభించిన కలెక్టర్

image

అచ్యుతాపురం మండలం తంతడి సముద్ర తీరంలో సముద్రపు నాచు మొక్కల సాగు కార్యక్రమాన్ని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. సముద్రపు నాచు ఆహారం, సేంద్రియ ఎరువులు, పశుగ్రాసాలు, చేపల మేతల తయారీకి ఉపయోగపడతుందన్నారు పర్యావరణానికి అనుకూలంగా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందన్నారు. తక్కువ పెట్టుబడితో 20-25 రోజుల్లో కోత వేసి లాభం పొందొచ్చన్నారు.

News January 5, 2026

HYD: ఆధార్ సెంటర్ ఎక్కడో ఈజీగా తెలుసుకోండి

image

గ్రేటర్ పరిధి రామంతాపూర్లో ఆధార్ సెంటర్ వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాసిన కథనంపై ఆధార్ సర్వీస్ యంత్రాంగం స్పందించింది. ఆధార్ అప్డేట్ చేసుకునేవారు పెరగటంతో రద్దీ ఏర్పడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. గ్రేటర్ HYD వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, వాటి వివరాలు తెలుసుకోవడం కోసం bhuvan.nrsc.gov.in/aadhaar/ వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.

News January 5, 2026

నందీశ్వరుడు శివుడి వైపే ఎందుకు చూస్తాడు?

image

శివాలయాల్లో నంది శివుడి వైపే చూస్తుంటాడు. ఇది ఏకాగ్రత, భక్తికి సంకేతం. ఆయన శివుడికి అత్యంత సన్నిహితుడైన ద్వారపాలకుడు. మనసులోని ఆలోచనలు అటు ఇటు తిరగకుండా ఎప్పుడూ దైవచింతనలోనే ఉండాలని నంది స్థితి మనకు బోధిస్తుంది. భక్తుల కోరికలను విన్నవిస్తూ, వారిని శివదర్శనానికి సిద్ధం చేసేందుకు ఆయన శివుడి వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెవిలో కోరికలు చెబితే వాటిని ఆయన నేరుగా శివుడికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.